నయనతార - విగ్నేష్ పెళ్లికి సర్వం సిద్ధమైంది. స్టార్ హీరోలకి, సన్నిహితులకు పెళ్లి ఆహ్వానాలు అందాయి. నయనతారే తన పెళ్లి ఏర్పాట్లని కాబోయే భర్త విగ్నేష్ శివన్ తో కలిసి చూసుకోవడమే కాదు, తమిళనాడు సీఎం దగ్గరనుండి సెలబ్రిటీస్ వరకు అందరిని దగ్గరుండి మరీ ఆహ్వానించారు కూడా. అయితే రేపు గురువారం చెన్నై సమీపంలోని మహాబలిపురంలో ఓ కాస్ట్లీ రిసార్ట్స్ లో జరగబోయే నయనతార - విగ్నేష్ ల ప్రీ వెడ్డింగ్ షూట్ ఆదివారం చెన్నై లోని ఓ స్టూడియో లో జరిగినట్టుగా తెలుస్తుంది.
అలాగే నయన్ - విగ్నేష్ పెళ్లి దర్శకుడు గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలో జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. గౌతమ్ మీనన్ ఈ పెళ్లి ని డైరెక్ట్ చేస్తున్నారట. ఈ పెళ్లి పిక్స్ విచ్చలవిడిగా బయటకి రాకుండా పెళ్లి తంతు షూట్ ముగిసాక ఆ ఫొటోస్ దగ్గరనుండి వీడియోస్ వరకు ఓ డాక్యుమెంటరిగా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యేట్టుగా ప్లాన్ చేశారట. ఈ నయన్ పెళ్లి భారీ ధరకు దక్కించుకుని.. నెట్ ఫ్లిక్స్ లోనే ఈ పెళ్లి వేడుకని ప్రసారం చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. నయన్ పెళ్ళికి తమిళనాడు సీఎం స్టాలిన్, స్టార్ హీరోలైన రజనీకాంత్, కమలహాసన్, చిరంజీవి, సూర్య, అజిత్, కార్తీ, సమంత లాంటి సెలబ్రిటీలు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు.