ప్రభాస్ ప్రస్తుతం తన దృష్టి మొత్తం ప్రశాంత్ నీల్ సలార్ మీదే పెట్టారు. ప్రాజెక్ట్ కె షూటింగ్ కి విరామం ఇచ్చిన ప్రభాస్ అలుపు లేకుండా సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. నిన్నటివరకు రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ సెట్ లో జరిగిన సలార్ షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీకి మారింది. జూన్ 8 అంటే ఈ రోజు నుండి ఓ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ను అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.
ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ సలార్ లో నటించబోయే మెయిన్ విలన్స్ తో తలపడతారని, ఈ సీక్వెన్స్ సినిమాకి హైలెట్ గా నిలవబోతుంది అంటున్నారు. సలార్ లో 12 నుండి 15 మంది విలన్స్ ఉండబోతున్నారని, ఇప్పటికే పది మంది విలన్స్ ఫైనల్ అయ్యారని తెలుస్తుంది. ఇక సలార్ టీజర్ ని ప్రభాస్ బర్త్ డే టైం కి సిద్ధం చేస్తున్నారని, వచ్చే వేసవిలో సలార్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతి హాసన్ నటిస్తుంది. అలాగే మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.