Advertisementt

సోషల్ మీడియా మొత్తం వాళ్ళే కబ్జా చేస్తారు

Wed 08th Jun 2022 10:15 PM
nayanthara,vignesh shivan,nayanthara - vignesh shivan wedding,nayan - vignesh wedding updates  సోషల్ మీడియా మొత్తం వాళ్ళే కబ్జా చేస్తారు
Nayanthara, Vignesh Shivan to get married on Thursday June 9th సోషల్ మీడియా మొత్తం వాళ్ళే కబ్జా చేస్తారు
Advertisement
Ads by CJ

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఇన్నాళ్ళకి తీరుతుంది. అది లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి, ఓ రెండుసార్లు పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిన నయనతార పెళ్లి ఈసారి విగ్నేష్ శివన్ తో జరగబోతుంది. ఆమె ఫాన్స్, మీడియా మిత్రులు ఎంతో కాలం కాదు, ఎన్నో ఏళ్ళ నుండి వెయిట్ చేస్తున్న సమయం రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో నయనతార-విగ్నేష్ శివన్ లు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో రేపు గురువారం ఉదయం నయనతార-విగ్నేష్ శివన్ ల పెళ్లి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, తమిళనాడు సీఎం, రజిని, కమల్ లాంటి అగ్రతారల మధ్యన అంగరంగ వైభవంగా జరగబోతుంది.

పెళ్లి జరిగిన వెంటనే కాకుండా మధ్యాహన్నం నుండి నయనతార - విగ్నేష్ ల వెడ్డింగ్ ఫొటోస్ సోషల్ మీడియా లో హడావిడి చెయ్యడానికి ముందు అంటే రెండురోజుల ముందు నుండే #Nayantharawedding హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ ఆమె ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. నయనతార వెడ్డింగ్ కార్డు దగ్గరనుండి సీఎం స్టాలిన్ పిలుపుల వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక నయనతార వెడ్డింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ అయితే సోషల్ మీడియా మొత్తం నయన్ - విగ్నేష్ శివన్ ల పెళ్లి ఫొటోస్ లే కనిపిస్తాయి. ఇప్పటివరకు పెళ్లి కార్డ్ తప్ప.. అక్కడ పెళ్లి కి ముందు జరగాల్సిన, మెహిందీ, సంగీత్, మంగళ స్నానాలు లాంటి ఫొటోస్ ఒక్కటీ బయటికి రాలేదు. అయినా #Nayantharawedding హాష్ టాగ్ మాత్రం ట్రెండ్ అవుతూనే ఉంది. అవొస్తే ఇక సోషల్ మీడియా మొత్తం నయన్ - విగ్నేష్ లే కబ్జా చేసేలా ఉన్నారు.

Nayanthara, Vignesh Shivan to get married on Thursday June 9th:

Nayanthara, Vignesh Shivan wedding updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ