నయనతార - విగ్నేష్ శివన్ ల వివాహం చెన్నై సమీపంలోని మహాబలిపురంలోని ఓ రిసార్ట్స్ లో అంగరంగ వైభవంగా ఈ రోజు జూన్ 9 ఉదయం మొదలైపోయింది. #NayantharaVigneshWedding, విక్కీ - నయన్ వెడ్డింగ్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. నయనతార - విగ్నేష్ శివన్ ల పెళ్లి తంతు గ్రాండ్ గా మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే నయనతార పెళ్ళికి హాజరయ్యే సెలబ్రిటీస్ పై అందరిలో ఎంతో ఆసక్తి ఉంది. నయన్ పెళ్ళికి ఏ ఏ సెలబ్రిటీస్ హాజరవుతారు, ఏ స్టార్ హీరోలు ఏ భాషల నుండి హాజరవుతారనే విషయంలో అందరిలో ఎంతో క్యూరియాసిటీ.
అయితే నయనతార పెళ్ళిలో సూపర్ స్టార్ రజినీకాంత్, అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, ఇంకా బోని కపూర్, కార్తీ, రాధికా-శరత్ కుమార్ లాంటి సెలబ్రిటీస్ పాల్గొన్నారని, ఇంకా కొంతమంది టాప్ సెలబ్రిటీస్ కూడా నయనతార పెళ్ళిలో సందడి చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. షారుఖ్ ఖాన్ నయనతారతో జవాన్ మూవీ చేసున్నారు. అందుకే ఆయనని నయన్ స్పెషల్ గా తన వివాహానికి ఆహ్వానించింది. ఇక ప్రస్తుతం నయనతార పెళ్ళికి ఏ ఏ గెస్ట్ లు వస్తున్నారో అనే అతృతతో ఆమె ఫాన్స్ సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టారు. ఇక ఈ రోజు మధ్యాన్నానికి నయన్-విగ్నేష్ పెళ్లి ఫొటోస్ బయటికి వచ్చే అవకాశం ఉంది.