నయనతార - విగ్నేష్ శివన్ ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో హాట్ టాపిక్. నయనతార ఏడేళ్ల ప్రేమని విగ్నేష్ తో పంచుకుని నేడు పెళ్లి పీటలెక్కింది. గతంలో రెండుసార్లు పెళ్లి పీటలవరకు వచ్చి ఆగిన నయనతార పెళ్లి నేడు విగ్నేష్ శివన్ తో అంగరంగ వైభవంగా బీచ్ వ్యూ ఉండే మహాబలిపురం షెరటాన్ రిసార్ట్స్ లో జరిగింది. ఈ పెళ్ళికి టాప్ సెలబ్రిటీస్ హాజరయ్యారు. రజిని, షారుఖ్, బోని కపూర్, కార్తీ లాంటి సెలబ్రిటీస్ ఈ పెళ్ళికి హాజరైన వారిలో ఉన్నారు. అయితే నయనతారకి మూడు ముళ్ళు వెయ్యబోతున్న విగ్నేష్ శివన్ పెళ్ళికి ముందు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఈరోజు జూన్ 9. నయనతార పెళ్లి. నన్ను ఆశీర్వదించే ప్రతి ఒక్కరికి, ఆ దేవుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నయనతారతో నా ప్రతి క్షణాన్ని నా జీవితాన్ని మరింత అందంగా మార్చేశాయి. మా ఇద్దరి కోసం మీ అందరూ చేసిన ప్రార్ధనలకు ధన్యవాదాలు. నయనతార.. నా భార్య.. మరికొన్ని గంటల్లోనే నీతో కలిసి ఏడడుగులు వేయబోతున్నందుకు సంతోష పడుతున్నాను. నీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నందుకు సంతోషంతో ఎదురు చూస్తున్నాను అంటూ విగ్నేష్ ఆనందంతో సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది.