బిగ్ బాస్ సీజన్ 5 వలన ఇద్దరు కంటెస్టెంట్స్ తమ తమ పర్సనల్ లైఫ్ లో చాలా ప్రోబ్లెంస్ ఫేస్ చేసారు. హౌస్ లో వారి అతి ఫ్రెండ్ షిప్ వలన బయటికి వచ్చాక వారి లవర్స్ ని కోల్పోయారు. అందులో బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ షణ్ముఖ్ అయితే తన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ చేసుకోవాల్సి వచ్చింది. తనని ఎంతో ఇష్టపడిన దీప్తి సునయన షణ్ముఖ్ కి సోషల్ మీడియాలోనే బ్రేకప్ చెప్పేసింది. అలా షణ్ముఖ్ సఫర్ అయ్యాడు. ఇక మరో కంటెస్టెంట్ సిరి ని కూడా ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ వదిలేస్తున్నారు.. ఆల్మోస్ట్ బ్రేకప్ అనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
శ్రీహన్ కూడా సిరి ఫొటోస్ ని సోషల్ మీడియాలో డిలేట్ చెయ్యడంతో ఆ బ్రేకప్ నిజమే అనుకున్నారు. కానీ గత కొన్ని రోజులుగా సిరి అండ్ శ్రీహాన్ ఇద్దరూ ప్యాచప్ అయ్యారు. సిరి బర్త్ డే లో శ్రీహన్, అలాగే శ్రీహాన్ బర్త్ డే కి సిరి ఇంకా సోషల్ మీడియా లో తరచూ సిరి - శ్రీహన్ కలిసే కనబడుతున్నారు. రీసెంట్ గా శ్రీహాన్-సిరి ఓ పెళ్ళిలో కలిసి దర్శనమివ్వగానే.. అదేమిటి ఇద్దరూ బ్రేకప్ అన్నారు.. ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్ళే కనిపిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇక సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ బిగ్ బాస్ 6 లోకి అడుగుపెట్టే ఆకాశం ఉంది అంటున్నారు. మరోపక్క సిరి వెబ్ సిరీస్ షూటింగ్స్ తో బిజీగా మారింది.