చిరంజీవి-మెహర్ రమేష్ కలయికలో రూపొందుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్. ఏ సినిమా తమిళ సూపర్ హిట్ ఫిలిం వేదాళం రీమేక్. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకునం భోళా శంకర్ ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది. మెగావైబ్ తో కొత్త షెడ్యూల్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.
మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవిని మెగా స్టైలిష్ గా కనిపించి అలరించారు. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది.