మహేష్ బాబు ని ప్రేమించకముందు, పెళ్లి చేసుకోకముందు నమ్రత శిరోద్కర్ హీరోయిన్. తెలుగులో చిరు లాంటి హీరోస్ తో నటించింది. అయితే మహేష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రత ఇంటికే పరిమితమైంది. మహేష్ హీరోగా సినిమాలు చేస్తుంటే నమ్రత పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. మహేష్ బాబు బిజినెస్ వ్యవహారాలని నమ్రతనే చూసుకుంటుంది. అటు మహేష్ చేస్తున్న మంచి పనుల్లో మేజర్ పార్ట్ నమ్రతదే. ప్రస్తుతం మహేష్ నిర్మాతగా పేరు మాత్రమే.. వెనకుండి చూసుకుంటుంది నమ్రతానే. భర్త మహేష్, పిల్లలు సితార, గౌతమ్ లతో కలిసి యాడ్స్, ఫోటో షూట్స్ లో కనిపించే నమ్రత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
తాజాగా నమ్రత ఓ షో రూమ్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు తన రీ ఎంట్రీ విషయాలు పంచుకుంది. తనని సినిమాల్లో నటించమని చాలామంది అభిమానులు కోరుతున్నారు. కానీ వారిని ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాను. నేను ప్రస్తుతం నా ఫ్యామిలీ బాధ్యతలను చూసుకోవడం లో బిజీగా వున్నాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే సినిమాలపై దృష్టి పెట్టడం లేదు. అసలు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ నటించాలనే ఆసక్తి కూడా నాకు లేదు. ప్రస్తుతం ఆ లోచన లేదు, ఫ్యూచర్ లో కూడా ఆ ఆలోచన ఉండకపోవచ్చు అంటూ రీ ఎంట్రీ పై నమ్రత ఫుల్ క్లారిటీ చేసింది.