గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ బర్త్ డే కు ప్రేక్షకులు, అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ బర్త్ డే స్పెషల్స్ అందించారు. బాలకృష్ణ బర్త్ డే స్పెషల్ గా ఆయన కొత్త చిత్రం అధికారికంగా ప్రకటించారు. F3తో డబుల్ హ్యాట్రిక్లు సాధించిన బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి #NBK108 కోసం మెగాఫోన్ పట్టనున్నారు.
క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా డిఫరెంట్ కథనంతో భారీగా తెరకెక్కనుంది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు అనిల్ రావిపూడి... బాలకృష్ణను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి పర్ఫెక్ట్, మాస్ అప్పీలింగ్ స్క్రిప్ట్ను రెడీ చేశారు. సినిమాలోని ప్రతి సన్నివేశం ఎక్స్ టార్డీనరీగా ఉండేలా ప్రస్తుతం స్క్రిప్ట్ను తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. అనిల్-బాలయ్య కాంబో మూవీ కి బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ పరీలనలో ఉంది అని, అది బాలయ్య బర్త్ డే స్పెషల్ గ ఈ రోజు రివీల్ చేస్తారని అన్నప్పటికీ.. జస్ట్ ప్రకటనతోనే సరిపెట్టారు మేకర్స్.
#NBK108 చిత్ర తారాగణం, సాంకేతిక విభాగం వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడించనుంది.