బాలయ్య బర్త్ డే లు వస్తున్నాయి, వెళుతున్నాయి. గత నాలుగేళ్లుగా ఆయన కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ పై వార్తలు రావడము, బాలకృష్ణ కూడా వాటిని సపోర్ట్ చెయ్యడంతో నందమూరి ఫాన్స్ చాలా ఆతృతగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆఖరికి ఈ బర్త్ డే రోజు అయినా కొడుకు వెండితెర ఎంట్రీ పై బాలయ్య ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ బాలయ్య పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన సినిమాల లుక్స్, టీజర్ అన్ని ఫాన్స్ కి మత్తిచ్చాయి. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ న్యూస్ బయటికి రాలేదు. దానితో నందమూరి ఫాన్స్ మళ్ళీ డిస్పాయింట్ అయ్యారు.
అయితే మోక్షజ్ఞ అప్పుడే హీరో అవ్వడానికి రెడీగా లేడనే విషయం ఆయన లుక్ తరచూ చెబుతూనే ఉంది. హీరో కి ఉండాల్సిన ఫిట్ నెస్ లేదు, లుక్ పరంగాను, స్టయిల్ పరంగాను మోక్షజ్ఞ ఇంకా చేంజ్ అవ్వాల్సి ఉంది. ఇక మోక్షజ్ఞ లుక్ బయటికి వచ్చిన ప్రతిసారి నందమూరి ఫాన్స్ డిస్పాయింట్ అవుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మోక్షజ్ఞ లుక్ చూసిన ఫాన్స్ ఖుషి అవుతున్నారు. తాజాగా మోక్షజ్ఞ బుల్లెట్ పై కూర్చుని స్టైలిష్ గానే కాదు, స్లిమ్ గా హీరోలా కనిపించేసరికి నందమూరి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది.