జబర్దస్త్ జబర్దస్త్ అన్న కామెడీ ప్రియులు ఇప్పుడు ఆ జబర్దస్త్ లో టాప్ కమెడియన్స్ లేరన్న కారణంగా వేరే ఛానల్ కి మారిపోతున్నారు. కొన్నేళ్లుగా జబర్దస్త్ షో ని తలదన్నే షోస్ రెడీ అయినా.. తర్వాత కిందామీదా పడుతూ ప్యాకప్ చెప్పేసాయి. కానీ ఇప్పుడు జబర్దస్త్ ని స్టార్ మా కామెడి స్టార్స్ తొక్కేయ్యడానికి రెడీగా ఉంది. ఎందుకంటే జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఇప్పుడు స్టార్ మా లోనే కనబడుతున్నారు. సుధీర్, అభి, ఆర్పీ, ధనరాజ్ ఇలా చాలామంది స్టార్ మాకి జంప్ అయ్యారు. సుధీర్, శ్రీను, ఆది జబర్దస్త్ వదిలెయ్యడంతో జబర్దస్త్ అంతా బోసిపోయింది. తాజాగా రామ్ ప్రసాద్, శ్రీను, సుధీర్ ఫ్రెండ్ షిప్ స్కిట్ చేసాడు రాకింగ్ రాకేష్.
దానితో సెట్ లో ఉన్న కమెడియన్స్ అలాగే రామ్ ప్రసాద్, ఇంకా జెడ్జెస్ ఇంద్రజ, సదా, రష్మీ అందరూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. సుధీర్ - రామ్ ప్రసాద్ - శ్రీనులు జబర్దస్త్ మొదలైనప్పటినుండీ ఇప్పటి వరకు చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుని కొన్ని స్కిట్స్ మిస్ అయినా మళ్ళీ జబర్దస్త్ కి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి శ్రీను, సుధీర్ ఇకపై రానట్టే కనిపిస్తుంది ప్రస్తుత వ్యవహారం. దానితో రామ్ ప్రసాద్ ఒంటరిగా అయ్యాడు. అందుకే ఆ కన్నీళ్లు. ఇక తమ ఫ్రెండ్ షిప్ ఎప్పటికి విడిపోదు అనుకున్నామని కానీ.. ఇప్పుడు ఇలా అంటూ రామ్ ప్రసాద్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇక తమ కన్నీళ్లు అన్నీ నిజమని, టీఆర్పీ కోసం కాదని, సుధీర్, శ్రీను మా మధ్యలో బాండింగ్ అలాంటిది అంటూ రామ్ ప్రసాద్ జబర్దస్త్ స్టేజ్ పై ఎమోషనల్ అయ్యాడు.