ప్రస్తుతం జబర్దస్త్ లో కామెడీ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. జబర్దస్త్ లో కమెడియన్స్ కొరత కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ప్రస్తుతం హైపర్ ఆది కానీ సుడిగాలి సుధీర్ కానీ, శ్రీను కానీ జబర్దస్త్ లో కనిపించడం లేదు. అయితే ఎలాగో స్కిట్స్ విషయంలో స్పెషల్ స్కిట్స్ అని, ఇంకా ఏదేదో తిప్పలు పడుతున్నారు కమెడియన్స్. అయితే వచ్చే వారం ప్రసారం కాబోతున్న జబర్దస్త్ లో స్టేజ్ పై ఇంద్రజ కొన్ని విషయాలను స్ట్రయిట్ గా కమెడియన్స్ ని అడిగేయ్యగా.. వారు కూడా తిరిగి ఇంద్రజాని గట్టిగానే ఇరికించారు.
ఇంద్రజ జబర్దస్త్ స్టేజ్ పై కూర్చుని బుల్లెట్ భాస్కర్ ని.. మీ టీం లో మీతో సమానమైన ఓ పెద్దాయన్ని కావాలనే తీసేశారంట అంటూ అప్పారావు గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడింది ఇంద్రజ. దానికి బుల్లెట్ భాస్కర్.. ఆ విషయం గురించి ఎక్కడా స్పందించకూడదు అనుకున్నా. ఆయన పెద్దాయన వెళ్లిపోయారు అంటూ ఏదో ఇంద్రజతో అన్నాడు. ఇక రామ్ ప్రసాద్ ని పిలిచి మీరు స్క్రిప్ట్ లు సరిగ్గా రాయకపోవడం వలనే మీ టీం లో ఇద్దరు వెళ్లిపోయారని అడిగేసరికి.. సీరియస్ గా ఈ ప్రశ్న అడిగిన వారికి అంటూ ఏదో చెప్పాడు. అప్పుడే రామ్ ప్రసాద్ లేచి.. నేను కూడా ఓ ఓన్ ప్రశ్న ఆడోగొచ్చా మేడం అంటూ రోజా గారు మినిస్టర్ కాకూడదు అని మీరు దేవుణ్ణి మొక్కుకున్నారంట ఎందుకు మేడం అంటూ అడిగిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నెటిజెన్స్ చేసే కామెంట్స్ ని ఇంద్రజ, రామ్ ప్రసాద్ ఇలా స్టేజ్ పై అడిగినట్లుగా ఈ ప్రోమో చూస్తే తెలుస్తుంది.