బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించినా బిందు మాధవి మాత్రం స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చెయ్యలేకపోయింది. హీరో రామ్, సాయి రామ్ శంకర్ లతో సినిమాలు చేసినా బిందు మాధవికి పేరు రాలేదు. ఆమెకి స్టార్ హీరోల ఛాన్స్ లు రాలేదు. తమిళనాట అయినా సక్సెస్ అవుదామనుకున్న ఈ తెలుగమ్మాయికి అక్కడా నిరాశే ఎదురైంది. అయితే బిగ్ బాస్ ఓటిటి లోకి ఆఫర్ రావడంతో కాస్త ధైర్యంగా అడుగువేసిన బిందు మాధవి బిగ్ బాస్ ఓటిటి టైటిల్ తో బయటికి వచ్చింది.
బిగ్ బాస్ లో తన వ్యక్తిత్వాన్ని చాటుకుని అభిమానుల మనసులు గెలుచుకోవడమే కాదు, బిగ్ బాస్ లో ఉన్నప్ప్పుడు బిందు మాధవికి అనూహ్యంగా ఫాన్స్ గణం పెరిగిపోయింది. దానితో సోషల్ మీడియాలో బిందు మాధవి తరచూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ వచ్చింది. విన్నర్ అయ్యేవరకు ఆమె ఫాన్స్ ఆమెని బాగా సపోర్ట్ చేసారు. ఈ రోజు జూన్ 14 బిందు మాధవి పుట్టిన రోజు కావడంతో మరోసారి ఆమె ట్విట్టర్ లో ట్రేండింగ్ లోకి వచ్చింది. #HBDBinduMadhavi హాష్ టాగ్ తో ఆమెకి ఫాన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు.