Advertisementt

షూటింగ్ లో అదిరే అభికి ప్రమాదం

Tue 14th Jun 2022 03:41 PM
adhire abhi,jabardasth,star maa,comedy stars,abhi injured in film shooting  షూటింగ్ లో అదిరే అభికి ప్రమాదం
Jabardasth Adhire Abhi sustained serious injuries షూటింగ్ లో అదిరే అభికి ప్రమాదం
Advertisement
Ads by CJ

అదిరి అభి అంటే తెలియని వారుండరు. జబర్దస్త్ స్టార్ట్ అయ్యాక అభి ఓ టీం ని ఫామ్ చేసుకుని అదిరే అభి అంటూ టీం లీడర్ గా ఈమధ్య కాలం వరకు జబర్దస్త్ ని వదల్లేదు. కానీ ఇప్పుడు అదిరే అభి స్టార్ మా లో కామెడీ స్టార్స్  లో వస్తున్నాడు. జబర్దస్త్ కి బై బై చెప్పేసి ఇప్పుడు కామెడీ స్టార్స్ లో బిజీ అయ్యాడు. మరోపక్క వెండితెర మీద కూడా అదిరే అభి ఒకటి రెండు సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ లో అభికి ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది.

సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న అదిరే అభి రెండు రోజుల కీలక షెడ్యూల్ కోసం ఫైట్ సన్నివేశాల్లో స్టంట్స్ చేసేందుకు ప్రత్యేకంగా ప్రాక్టీస్ కూడా చేసాడు. ఆ తర్వాత షూటింగ్ లో పాల్గొన్న అభి అదే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించే టైం లోనే గాయాలు అయ్యాయి అని తెలుస్తుంది. దానితో అభి చేతికి తీవ్రంగా దెబ్బ తగిలినట్లుగా చెబుతున్నారు. షూటింగ్ స్పాట్ లో అభికి ఫస్ట్ ఎయిడ్ చెయ్యగా.. తర్వాత ఆసుపత్రికి వెళ్లిన అభి.. కొద్దిరోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్స్ చెప్పడంతో అభి చెయ్యాల్సిన ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. 

Jabardasth Adhire Abhi sustained serious injuries:

Adhire Abhi injured in film shooting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ