జూన్ 9 న అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని తర్వాతి రోజే తిరుపతి లో ప్రత్యక్షమైన నయనతార - విగ్నేష్ ల జంట.. అక్కడ శ్రీవారి దర్శనం తర్వాత ఫోటో షూట్ వివాదంలో చిక్కుకున్నారు. మీడియా ముఖంగా టీటీడీకి క్షమాపణ చెప్పిన నయనతార - విగ్నేష్ లు తర్వాత మీడియా సమావేశం నిర్వహించి మీడియా తో పెళ్లి విషయాలను పంచుకున్నారు. ఇక తర్వాత విగ్నేష్ శివన్ - నయనతారలు దైవ దర్శనాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పెళ్ళికి ముందు తిరుపతి, కులదైవం గుడి, షిర్డీ వెళ్లి వచ్చిన నయన్ దంపతులు పెళ్ళయిన తర్వాత ఇంకా కొన్ని ఆలయాలకు తిరుగుతున్నారు.
ఇందులో భాగంగానే నయనతార - విగ్నేష్ లు కేరళలోని చెట్టికులాంగర దేవి ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారి దర్శనం అంతరం పూజలు చేసారు. అయితే అక్కడి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఈ జంటని భక్తులు పోటీలు పెట్టి ఫొటోస్ తియ్యడం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంతేకాకుండా కొచ్చి లోని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ని వదిలేసి ఈ జంట అక్కడి చిన్న హోటల్ లో భోజనము చెయ్యడం మరింత ఆసక్తిని కలిగింది. నయన్ - విగ్నేష్ ల సింపుల్ సిటీకి వాళ్ళ ఫాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.