పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ పక్కన హీరోయిన్స్ గా, అచ్చ తెలుగు అమ్మాయిలా కనబడిన శ్రీలీల అదృష్టం మాములుగా లేదు. నిన్నమొన్నటివరకు పెళ్లి సందడి హీరోయిన్ కి ఆ ప్రాజెక్ట్ ఓకె అయ్యింది, ఈ ప్రాజెక్ట్ ఓకె అయ్యింది అని చెప్పడమే కానీ, రవితేజ, నవీన్ పోలిశెట్టి సినిమాల్లో ఫైనల్ అయినట్లుగా అప్ డేట్స్ మాత్రమే కనిపించాయి. కానీ తాజాగా శ్రీలీల పుట్టిన రోజు సందర్భంగా ఈ లక్కి హీరోయిన్ ఏ ఏ ప్రాజెక్ట్స్ కి సైన్ చేసిందో అనేది తేలిపోయింది. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాల్లో శ్రీలీల బాగా బిజీగా మారింది.
శ్రీ లీల 20 వ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్.. ఆమె నటిస్తున్న సినిమాల నుండి ఆమెకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఢమాకా లో రవితేజ సరసన శ్రీలీల నటిస్తుంది. ఢమాకా నుండి శ్రీలీలకి స్పెషల్ పోస్టర్ డిజైన్ చేసారు. తర్వాత సితార ఎంటర్టైన్మెంట్లో ఈ బ్యూటీ అనగనగా ఒక రాజు అనే సినిమాలో నవీన్ పోలిశెట్టి సరసన నటిస్తోంది. అంతేకాకుండా మెగా హీరో వైష్ణవ తేజ్ రాబోయే కొత్త సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది, అక్కడినుండీ ఆమెకి విషెస్ అందాయి. ఇక బాలయ్య - అనిల్ రావిపూడి సినిమాలో శ్రీలీలే బాలయ్య కూతురు అని అనిల్ రావిపూడి ఫిక్స్ అయ్యి పేరు రివీల్ చేసేసాడు. ఇవి కాకుండా ఈ బ్యూటీకి నితిన్ - వక్కంతం వంశి కాంబో ఛాన్స్, అలాగే మారుతి - ప్రభాస్ కాంబో ఛాన్స్ తగలబోతున్నాయనే టాక్ ఉంది. మరి నిజంగా లక్కీ బ్యూటీకి బర్త్ డే స్పెషల్ ట్రీట్స్ మాములుగా లేవుగా.. ఓ రేంజ్ లో ఉన్నాయి.