Advertisementt

ఇంట్రెస్టింగ్: విజయ్ vs ధనుష్

Tue 14th Jun 2022 11:06 PM
dhanush,thalapathy vijay,villain,lokesh kanagaraj,suriya,karthi  ఇంట్రెస్టింగ్: విజయ్ vs ధనుష్
Vijay vs Dhanush ఇంట్రెస్టింగ్: విజయ్ vs ధనుష్
Advertisement
Ads by CJ

ఇప్పుడు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపించడానికి ఎలాంటి పరిమితులు పెట్టుకోవడం లేదు. ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ స్టార్ హీరోలయినా కూడా కలిసి నటించి బ్లాక్ బస్టర్ కొట్టారు. అదే కోవలో లోకేష్ కనగరాజ్ విక్రమ్ లో కమల్, విజయ్ - ఫహద్ ఫాసిల్ ని కలిపి భారీ హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే ఊపులో స్టార్ హీరో విజయ్ ని స్టార్ హీరో ధనుష్ ని కలిపి సినిమా చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. విక్రమ్ తో విజయ్ సేతుపతి - కమల్ హాన్ - ఫహద్ ఫాసిల్ ని కలిపి బంపర్ బ్లాక్ బస్టర్ కొట్టిన లోకేష్ అదే ట్రెండ్ ని కంటిన్యూ చెయ్యాలని డిసైడ్ అయినట్లుగా- తెలుస్తుంది.

అంటే లోకేష్ కనగరాజ్ తదుపరి సినిమా విజయ్ తో చేస్తున్నాడు. విజయ్ కి విలన్ గా స్టార్ హీరో ధనుష్ ని దింపే యోచనలో ఉన్నట్లుగా కోలీవుడ్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ధనుష్‌కు కథ వినిపించాడట. ఆయనకు పాత్ర బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. మరి తదుపరి ఖైదీ 2 లోకి కార్తీ vs సూర్యని దింపడానికి ఫిక్స్ అయిపోయిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు విజయ్ vs ధనుష్ ని చూపిస్తే ఫాన్స్ కి పూనకాలు కాదు, వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ బాదుడే బాదుడు అన్నమాట.

Vijay vs Dhanush:

Dhanush says yes to become Thalapathy Vijay villain?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ