రవితేజ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ షూటింగ్స్ తో చాలా బిజీగా మారాడు. రామ రావు ఆన్ డ్యూటీని విడుదలకు సిద్ధం చేస్తున్న రవితేజ.. తర్వాత ధమాకా, ఇంకా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్నాడు. అయితే ఈ మధ్యన రవితేజ కి ఓ సినెమా షూటింగ్ లో గాయాలైనట్టుగా తెలుస్తుంది. రవితేజ కి టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. వంశీ కృష్ణ దర్శకత్వంలో 1970లో స్టువర్ట్‌పురంలో పేరుమోసిన దొంగ జీవిత చరిత్ర ఆధారంగా టైగర్ నాగేశ్వరరావు చిత్రం తెరకెక్కుతుంది.
అయితే ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న టైం లోనే రవితేజ తలకి బలమైన గాయమవడంతో.. వెంటనే ఆసుపత్రికి తరలించగా డాక్టర్స్ రవితేజ తలకి పది కుట్లు వేసి ఆ గాయాలు మానడానికి కనీసం రెండు నెలలు సమయం పడుతుందని, విశ్రాంతి తీసుకోమని చెప్పగా.. రవి తేజ మాత్రం రెండు రోజుల్లోనే సెట్స్ లోకి వచ్చేశారట. నిర్మాతలు నష్టపోకూడదని, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ తో పాటు ఇతర నటులకు సంబంధించిన డేట్లు వృదా అవుతాయనే ఉద్దేశ్యంతో కష్టం అయినా.. ఆ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసారని, రవితేజ డెడికేషన్ ని చిత్ర బృందం ఫిదా అయ్యింది అని అంటున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుండగా.. రవి తేజ సరసన నూపూర్ సనన్ మరియు గాయత్రి భరద్వాజ్ లు నటిస్తున్నారు.