ప్రభాస్ గత ఐదారేళ్లుగా భారీ విగ్రహంలా, బాగా బరువు పెరిగిపోయి కనిపిస్తున్నారు. బాహుబలి అంటే ఓకె.. ఆ తర్వాత ఆ బరువు కరిగించుకోవడానికి ప్రభాస్ నానా తంటాలు పడ్డారు. ప్రభాస్ ఫాన్స్ మళ్ళీ మిర్చిలో ప్రభాస్ లా ఆయన్ని చూడాలని కోరుకున్నారు. కానీ సాహో, రాధే శ్యామ్ సినిమాల్లో అటు లుక్స్ విషయంలోనూ, ఇటు బరువు విషయంలో స్క్రీన్ మీద కదలడానికి ప్రభాస్ ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. దానితో ఫాన్స్ పదే పదే డిస్పాయింట్ మూడ్ లోకి వెళ్లారు.
ప్రభాస్ ఫిజిక్ విషయంలో ఎంత కేర్ తీసుకున్నా ఆయన మాత్రం సన్నబడలేదు. లుక్ మారలేదు. కానీ నిన్న బుధవారం సడన్ గా ప్రభాస్ స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్ లో కనబడి మిర్చి లో స్టైలిష్, హ్యాండ్ సం ప్రభాస్ ని గుర్తుకు తెచ్చారు. దానితో ఫాన్స్ కడుపునిండి పోయింది. మళ్ళీ ఆయనపై ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. సలార్ లో మాస్ అవతార్ లో ప్రభాస్ అదరగొట్టడం ఖాయమని ఫిక్స్ అవుతున్నారు. సలార్ లో ప్రభాస్ డ్యూయెల్ రోల్ అనే ప్రచారం ఉంది.
అయితే సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి ఓ కండిషన్ పెట్టారని, బరువు తగ్గాకే సలార్ నెక్స్ట్ షెడ్యూల్ అని చెప్పాకే ప్రభాస్ ఇంతిలా బరువు తగ్గారని, లేదంటే రాధే శ్యామ్, అలాగే రాధే శ్యామ్ ప్రమోషన్స్ లోను బరువుగా భారంగా కనబడిన ప్రభాస్ ఇప్పుడు ఓ రెండు నెలలో బరువు తగ్గడం మాములు విషయం కాదంటున్నారు.