సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తే (తెలుగులో పెద్దన్న) తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. రజినీకాంత్ #Thalaivar169 చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చెయ్యబోతున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ బీస్ట్ తో డిజాస్టర్ కొట్టడంతో.. నెల్సన్ తో సినిమా చేసే విషయమై రజినీకాంత్ ఆలోచనలో పడ్డారు అన్నప్పటికీ.. నెల్సన్ మాత్రం రజినీకాంత్ తో తన సినిమా ఉంటుంది అని అప్ డేట్ ఇస్తూ వచ్చారు. కాగా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్షన్ లో త్వరలోనే మొదలు కాబోతున్న #Thalaivar169 టైటిల్ ఎనౌన్సమెంట్ నేడు అఫీషియల్ గా వచ్చేసింది.
రజినీకాంత్ #Thalaivar169 టైటిల్ గా జైలర్ అనే మాస్ టైటిల్ పెట్టడమే కాదు.. దానికి సంబందించిన పోస్టర్ లో రక్తంతో తడిచిన కత్తిని ఉంచడంతో.. ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అనిపిస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్ యాక్షన్ కథనే కామెడీ తో మిక్స్ చేసి నవ్వులు పూయిస్తాడు. మరి రజినీకాంత్ ని నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ గా ఎలాంటి లుక్ లో చూపిస్తాడో, ఈ కథ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ సూపర్ స్టార్ ఫాన్స్ లో వ్యక్తమవుతోంది. రజిని - నెల్సన్ - అనిరుధ్ ల క్రేజీ కాంబోలో రాబోతోన్న ఈ జైలర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.