Advertisementt

ఇప్పుడు కాదు అంటున్న సాయి పల్లవి

Fri 17th Jun 2022 03:06 PM
sai pallavi,police case,virata parvam movie,kashmir files  ఇప్పుడు కాదు అంటున్న సాయి పల్లవి
Complaint against Sai Pallavi ఇప్పుడు కాదు అంటున్న సాయి పల్లవి
Advertisement
Ads by CJ

సోషల్ మీడియాలో సాయి పల్లవి పేరు ట్రెండ్ అవుతుంది. వెన్నెల గా విరాట పర్వంలో ఆమె పెరఫార్మెన్స్ కి విజిల్స్ వేస్తున్నారు ఆడియన్స్. లుక్స్ పరంగాను, యాక్టింగ్ పరంగాను అదరగొట్టేసింది. అయితే తాజాగా సాయి పల్లవి ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసందే. గోవధ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి పై హైదరాబాద్ లో భజరంగ్ దళ్ సభ్యులు కేసు పెట్టారు. అలాగే కొంతమంది నెటిజెన్స్ సాయి పల్లవి అనవరసరమైన వ్యాఖ్యలతో తలనొప్పి కొనితెచ్చుకుంది అంటే.. కొంతమంది మాత్రం ఆమెకి మద్దతు పలుకుతున్నారు. ఇప్పటివరకు డీసెంట్ హీరోయిన్ గా ఉన్న సాయి పల్లవి ఇప్పుడు నెగెటివ్ కామెంట్స్ ఎదుర్కోవడం ఆమె ఫాన్స్ కి నచ్చడం లేదు. 

అయితే నిన్నటివరకు విరాట పర్వం ప్రమోషన్స్ లో పాల్గొన్న సాయి పల్లవిపై కేసు నమోదు కావడంతో.. నిన్న వైజాగ్ లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో సాయి పల్లవి పై కేసు విషయమై స్పందించమని కోరగా.. దానికి సాయి పల్లవి షాకింగ్ ఆన్సర్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో సాయి పల్లవిపై నెగెటివ్, పాజిటివ్ కామెంట్స్ పడుతుంటే.. సాయి పల్లవి మాత్రం ఆ విషయమై మాట్లాడడానికి ఇప్పుడు సమయం కాదంటూ, మరోసారి ఈ విషయమై స్పందిస్తాను అని చెప్పింది. 

Complaint against Sai Pallavi :

Sai Pallavi reaction on police case

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ