Advertisementt

మెగా154 సెట్స్‌ లో సుకుమార్

Fri 17th Jun 2022 06:10 PM
director sukumar,megastar chiranjeevi,bobby,mythri movie makers,mega154,hyderabad  మెగా154 సెట్స్‌ లో సుకుమార్
Mega154 Shoot Underway In Hyderabad మెగా154 సెట్స్‌ లో సుకుమార్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మెగా154 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

చిరంజీవి, శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణంపై చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. దర్శకుడు సుకుమార్ మెగా154 సెట్స్‌ని సందర్శించారు. సుకుమార్ సెట్స్ లో వున్న ఫోటోని అభిమానులతో పంచుకుకుంది చిత్ర యూనిట్. బాబీ, సుకుమార్‌ కి లాప్ టాప్ లో ఎదో చూపించడం, సుకుమార్ ఆసక్తికరంగా చూడటంలో ఈ చిత్రంలో గమనించవచ్చు.

మెగా154 బాబీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో బాబీ కల నిజమైనట్లయింది. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మెగాస్టార్‌తో శృతి హాసన్‌ ఈ చిత్రం కోసం తొలిసారి జతకట్టారు.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Mega154 Shoot Underway In Hyderabad:

Director Sukumar Visits The Sets Of Megastar Chiranjeevi, Bobby, Mythri Movie Makers Mega154, Shoot Underway In Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ