ఇప్పుడు మల్టీస్టారర్ మూవీస్ హవా బాగా నడుస్తుంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి ట్రిపుల్ ఆర్ చేయడం, అలాగే కమల్ హాసన్ తో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కలిసి నటించడం, రాబోతున్న ఖైదీ 2 లో కార్తీ-సూర్య స్క్రీన్ షేర్ చేసుకోవడం వంటి విషయాలతో మల్టీస్టారర్లు పై క్రేజ్ బాగా పెరిగిపోయింది. అయితే కోలీవుడ్ స్టార్ హీరోలైన విజయ్ - అజిత్ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారనే న్యూస్ అప్పుడప్పుడు మీడియా సర్కిల్స్ లో హైలెట్ అవుతుంది. అజిత్ ఫాన్స్, విజయ్ ఫాన్స్ మధ్యన పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పగలు ఉన్నాయి. మా హారో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకుంటూ గొడవలు పడుతుంటారు.
అలాంటి నేపథ్యంలో ఈ హీరోలిద్దరూ కలిసి సినిమా చేస్తే అంచనాలు మాములుగా ఉండేవి కావు. అజిత్ - విజయ్ కలిసి పాన్ ఇండియా మూవీ అంటే ఆ క్రేజే ఇరు. కానీ కోలీవుడ్ పీఆర్వో ఒకరు అజిత్ - విజయ్ కలిసి ఏ సినిమా చెయ్యడం లేదు, విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం విజయ్ - అజిత్ కలిసి పాన్ ఇండియా మూవీ చేసే విషయాన్ని ఆయా హీరోలు కొట్టిపారేశారని ట్వీట్ చెయ్యడం తో కొంతమంది డిస్పాయింట్ అయినా, విజయ్ - అజిత్ ఫాన్స్ మాత్రం కూల్ అయ్యారు.