బిగ్ బాస్ సీజన్ సిక్స్ జులై కానీ, ఆగస్టు లో కానీ మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ ఎప్పటినుండో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం మే లోనే బిగ్ బాస్ ఓటిటి ముగిసింది. అప్పుడే బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ మా లో అంటే మొహం మొత్తినట్టుగా ఉంటుంది. అందుకే కొద్దిగా గ్యాప్ ఇచ్చాక ఎప్పటిలాగే సెప్టెంబర్ లోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ ని మొదలు పెట్టే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్టుగా తెలుస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 6 ని సెప్టెంబర్ మొదటి వారంలోనే మొదలు పెట్టాలని ఒక ప్లాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అది కూడా సెప్టెంబర్ 4 నుండి మొదలు పెట్టె యోచనలో ఉన్నట్లుగా సమాచారం. బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఓపెనింగ్ ఎపిసోడ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని.. నాగార్జున హోస్ట్ గానే సీజన్ 6 మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. ఇక సీజన్ 6 కంటెస్టెంట్స్ పేర్లు కూడా ఇప్పటికే స్టార్ మా ఫైనల్ చేసి ఇంఫార్మ్ చేసింది అని, అందులో ఆది, చైత్ర రాయ్, దీప్తి పిళ్ళై, నవ్య స్వామి, వర్షిణి, యాంకర్ శివ, యాంకర్ ధనుష్ లు ఫైనల్ అయినట్లుగా తెలుస్తుంటే మరో యంగ్ హీరో సుమంత్ అశ్విన్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లుగా టాక్ ఉంది.