నిన్న ఉదయం నుండి టాలీవుడ్ సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జీతాలు పెంచితేనే కానీ.. షూటింగ్స్ కి హాజరు కాబోము అని భీష్మించుకుని కూర్చున్నారు. కార్మికులు. నిర్మాత సి కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చినా సినిమా కార్మికులు వినలేదు. అయితే ఈ రోజు సినీ కార్మికులకు నిర్మాతలకి మధ్య జరిగిన చర్చలు సఫలమవడంతో రేపటినుండి మళ్ళీ షూటింగ్ మొదలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో మీటింగ్ నిర్వహించాము.. చర్చలు సఫలమయ్యాయి.. రేపటినుండి యధావిధిగా షూటింగ్స్ జరుగుతాయని నిర్మాత సి కళ్యాణ్ చెప్పారు.
అంతేకాకుండా పెరిగిన వేతనాలు త్వరలోనే అమలులోకి వస్తాయని, కో ఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ ద్వారా పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయి అని ఆయన చెప్పడంతో స్టార్ హీరోలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా, భారీ బడ్జెట్ సినిమాలు చాలావరకు సెట్స్ మీదున్నాయి. అందులో ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె, పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, చిరంజీవి గాడ్ ఫాదర్, మెగా 154 , భోళా శంకర్, రామ్ చరణ్ RC15 ఇలా చాలా సినిమాల షూటింగ్స్ నిన్న సమ్మెతో ఆగిపోయాయి. ఇవే కాకుండా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న పలు ఇతర భాషా చిత్రాలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఇక రేపటినుండి సినీకార్మిలంతా కదిలి వస్తారని, షూటింగ్స్ జరుగుతాయని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.