పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్ గా ఆయన పనులు చక్కబెట్టేస్తున్నారా.. అంటే అవును అనే మాటే వినిపిస్తుంది. ప్రస్తుతం హరి హర వీరమల్లు షూటింగ్ అప్ డేట్ కోసం ఆయన ఫాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ ఆగిపోయిందో? లేదంటే తిరిగి స్టార్ట్ చేస్తారో? అనే క్లారిటీ లేకుండా ఫాన్స్ ఎదురుచూపులు ఉన్నాయి. మరోపక్క రాజకీయాల్లో అప్పుడప్పుడు పవన్ హైలెట్ అవుతున్నారు. ఇంతలోపులోనే మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో చెయ్యబోతున్న వినోదయ సిత్తం రీమేక్ ని పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టేశారని టాక్ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారంలో ఉంది.
తమిళ నటుడు-దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరక్కేయబోయే వినోదయ సిత్తం రీమేక్ పూజా కార్యక్రమాలు ఫినిష్ అయ్యాయని, రెగ్యులర్ షూటింగ్ కి కూడా డేట్ ఫిక్స్ అయ్యింది అంటున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారని, ముందుగా పవన్ కళ్యాణ్ పాత్ర తళుకు చిత్రీకరణ జరిపేసి తర్వాత మిగతా సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా ఎంపికైంది అని అంటున్నారు. మరి ఇలా సైలెంట్ గా సినిమా మొదలైంది అంటే పవన్ కళ్యాణ్ చాలా ఫాస్ట్ గా ఉన్నట్టే కదా..