సౌత్ హీరోల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన సినిమాలు వరసగా ప్లాప్ అయినా కూడా రజిని క్రేజ్ ఏమాత్రం తగ్గదు. రాబోయే మూవీస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు కూడా. ఇక రజినీకాంత్ కి ఉన్న ఫాన్స్ మరే ఇతర హీరోకి లేరంటే నమ్మాలి. తాజాగా రజినీకాంత్ తన నెక్స్ట్ మూవీ జైలర్ ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. బీస్ట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయిన నెల్సన్ దిలీప్ కుమార్ రజినీకాంత్ జైలర్ తో మెప్పించడానికి రెడీ అయ్యాడు.
సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ మరోసారి సూపర్ స్టార్ కి జోడిగా నటించబోతుంది అనే టాక్ ఉండగా.. ఇప్పుడు రజినీకాంత్ ఈ సినిమా కోసం ఏకంగా 150 కోట్ల పారితోషకమే అందుకోబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ ఫిగర్ నిజమైతే ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో ఉన్న అందరి స్టార్స్ కంటే రజినీకాంతే హైయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా చెప్పుకోవాలి. అలాగే ఈ పారితోషకంతో కంపేర్ చేస్తే రజినీకాంత్ ని నెంబర్ వన్ హీరోగానే అభిమానులు చూస్తారు.