Advertisementt

ప్రభాస్‌తో సినిమా ఎప్పుడైనా సిద్ధమే: గోపీచంద్

Sat 25th Jun 2022 03:55 PM
prabhas,gopichand,pakka commercial,maruti,prabhas-gopichand multistarer  ప్రభాస్‌తో సినిమా ఎప్పుడైనా సిద్ధమే: గోపీచంద్
Gopichand Comments About Prabhas ప్రభాస్‌తో సినిమా ఎప్పుడైనా సిద్ధమే: గోపీచంద్
Advertisement
Ads by CJ

గోపీచంద్ - మారుతి కాంబోలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ రిలీజ్ కి రెడీ అయ్యింది. జులై 1 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరు గెస్ట్ గా రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ కాన్ఫెరెన్స్ విజయవాడలోని రాజ్ యువారాజ్ థియేటర్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు చిత్రయూనిట్. 

ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హీరో గోపీచంద్ గారు మాట్లాడుతూ.. పక్కా కమర్షియల్ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని.. కచ్చితంగా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. అలాగే తనకు ప్రభాస్ అంటే చాలా యిష్టమని.. ఎప్పుడైనా తనతో నటించడానికి సిద్ధమే అని తెలిపారు. పైగా ఆయనతో మల్టీస్టారర్ చేయాలని ఉన్నట్లుగా ఆసక్తికర కామెంట్స్ చేసారు ఆయన.

Gopichand Comments About Prabhas:

Prabhas-Gopichand Multi-Starrer Possible?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ