ప్రభాస్ - ప్రశాంత్ నీల్ సలార్ పై ఇప్పటికే ట్రేడ్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ కటౌట్ కి ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ తోడైతే మాస్ గా బ్లాక్ బస్టర్ అవడం పక్కా అనేంతగా ఉన్నాయి అంచనాలు. అందులో ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వి రాజ్ సుకుమారన్ నటించడం కూడా ఆ అంచనాలు పెరగడానికి కారణమయ్యింది. తాజాగా పృథ్వీ రాజ్ సుకుమారన్ కడువా ప్రమోషన్స్ లో సలార్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండేళ్ల క్రితమే సలార్ లో నటించే ఆఫర్ తన దగ్గరకు వచ్చింది అని చెప్పారు ఆయన.
సలార్ స్క్రిప్ట్ ఎప్పుడో విన్నానని, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2, కరోనా లాక్ డౌన్ కన్నా ముందే తనకి వినిపించారని, కథ విని చాలా ఎగ్జైట్ అయ్యి ఓకే చెప్పాను, సలార్ నిజంగా చాలా మంచి స్క్రిప్ట్ అంటూ కడువా ప్రెస్ మీట్ లో పృథ్వి రాజ్ చేసిన కామెంట్స్ సలార్ పై అంచనాలు మరింతగా పెరిగేలా చేసింది. ఇక ఈ సినిమాలో ఓ 12 మంది విలన్స్ ఉండబోతున్నారని, ప్రభాస్ వాళ్లందరితో తలపడతారని అంటున్నారు. అంతేకాకుండా హీరోయిన్ శృతి హాసన్ పై కూడా ప్రశాంత్ నీల్ ఓ యాక్షన్ సీన్ ని డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది.