రష్మిక ఇప్పుడు అన్ని భాషల్లో వన్ అఫ్ ద మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వరస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతుంది. తెలుగులో పుష్ప 2 పాన్ ఇండియా ఫిలిం, తమిళంలో విజయ్ తో బైలింగువల్ వారసుడు, మలయాళం లో సీత రామం, హిందీలో సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసిన నటించిన మిషన్ మజ్ను ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లోను రష్మిక పాల్గొంటుంది. అంతేకాకుండా బాలీవుడ్ సూపర్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ మూవీలో నటిస్తుంది.
ఇక అమితాబచ్చన్ తో కలిసి గుడ్ బై లో నటిస్తున్న రష్మిక.. తాజాగా ఆ చిత్రం షూటింగ్ పూర్తవడంతో తెగ ఫీలైపోతుంది. గుడ్ బై సినిమాకి గుడ్‌బై చెప్పడం అస్సలు ఇష్టం లేదు. 2 ఇయర్స్ గా కోవిడ్ అయినప్పటికీ.. మేము చేసుకున్న పార్టీలు ఎవరూ అడ్డుకోలేకపోయారు. అసలు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సార్‌తో కలిసి పనిచేసే అవకాశం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచంలో ఆయనే అత్యుత్తమ మనిషి. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ వికాస్ బహల్‌కు కృతజ్ఞతలు. కానీ నన్ను ఎందుకు ఈ సినిమాలోకి తీసుకున్నారో ఆ దేవుడికే తెలియాలి అంటూ ట్వీట్ చేసింది రష్మిక.