Advertisementt

ప్రాజెక్ట్ కే షూట్ లో ప్రభాస్ - దుల్కర్ - అమితాబ్

Sun 26th Jun 2022 02:45 PM
project k,prabhas,project k update,dulquer salmaan,project k sets  ప్రాజెక్ట్ కే షూట్ లో ప్రభాస్ - దుల్కర్ - అమితాబ్
Dulquer Salmaan in Project K sets ప్రాజెక్ట్ కే షూట్ లో ప్రభాస్ - దుల్కర్ - అమితాబ్
Advertisement
Ads by CJ

నిన్న శనివారం సీత రామం టీజర్ లాంచ్ కోసం మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హైదరాబాద్ కి వచ్చారు. ఈ సినిమాని హను రాఘవపూడి తెరకెక్కిస్తుండగా.. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్ అంటే అశ్విని దత్ కూతురు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ లాంచ్ తర్వాత దుల్కర్ సల్మాన్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ ల ప్రోజెక్ట్ కె షూటింగ్ జరుగుతున్న సెట్స్ కి వెళ్లారు. అశ్విని దత్ నిర్మాత కావడం, నాగ్ అశ్విన్ ఆయన అల్లుడు కావడంతో స్వప్న దత్ దుల్కర్ ని ప్రోజెక్ట్ కె షూట్ కి తీసుకువెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ప్రోజెక్ట్ కె షూటింగ్ ప్రభాస్ - అమితాబచ్చన్ ని కలిసిన దుల్కర్ అమితాబ్, ప్రభాస్ తో మాట్లాడుతూ ఆ వీడియోలో కనిపించారు. ప్రభాస్ ఆ వీడియో లో తలకి క్లాత్ కట్టుకుని కనిపించారు. అమితాబ్ తో దుల్కర్ ముచ్చట్లు ను, ప్రభాస్ టీం తో కలిసి సరదాగా నవ్వుతున్న ఉన్న వీడియో ని ప్రభాస్ ఫాన్స్ ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు. ఇక ప్రోజెక్టు షూటింగ్ లో దీపికా పదుకొనె పాల్గొనడం లేదు. ఆమె రీసెంట్ గానే హైదరాబాద్ నుండి ముంబై కి వెళ్ళింది. ఇంకా ఈ సినిమాలో దిశా పటాని మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్ గా తెరకెక్కుతుంది.  

Dulquer Salmaan in Project K sets:

Project K Shooting update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ