Advertisementt

సల్మాన్ పరువు తీసిన కుర్ర హీరోయిన్

Sun 26th Jun 2022 06:39 PM
sara ali khan,salman khan,uncle,superstars,iifa awards  సల్మాన్ పరువు తీసిన కుర్ర హీరోయిన్
Sara Ali Khan calls Salman Khan uncle సల్మాన్ పరువు తీసిన కుర్ర హీరోయిన్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ పెళ్ళికొడుకు ఎవరు అంటే ఇంకెవరు కండల వీరుడు సల్మాన్ ఖాన్ నే చూపిస్తారు. తన కెరీర్ లో పెళ్లి అనే పదానికి చోటివ్వకుండా గడిపేస్తున్న సల్మాన్ ఖాన్ కి లవ్ ఎఫ్ఫైర్స్ ఏమి తక్కువ లేవు. ఇక వరస సినిమాలు, బిగ్ బాస్ హోస్ట్ గా బిజీ లైఫ్ ని లీడ్ చేసే సల్మాన్ ఖాన్ పక్కన ఛాన్స్ రావాలనే కోరిక ప్రతి హీరోయిన్ కి ఉంటుంది. కానీ బాలీవుడ్ కుర్ర హీరోయిన్ ఒకరు సల్మాన్ ఖాన్ ని అంకుల్ అని పిలిచి ఆయన పక్కన నటించే ఛాన్స్ పోగొట్టుకుంది. అంటే అదంతా ఫన్నీగానే జరిగినా.. సోషల్ మీడియాలో మాత్రం తెగ హైలెట్ అయ్యింది. 

రీసెంట్ గా దుబాయ్ లో ఐఫా అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేడుకలో సల్మాన్ ఖాన్, ఇంకా చాలామంది బాలీవుడ్ స్టార్స్ స్టేజ్ పై ఫన్నీ స్కిట్స్ చేసారు. అందులో భాగంగా సల్మాన్ ఖాన్ - సారా అలీ ఖాన్ స్టేజ్ పైకి వచ్చారు. ఆ స్టేజ్ పై సారా అలీ ఖాన్ మాట్లాడుతూ సల్మాన్ ఖాన్‌ను అంకుల్ అని పిలిచేసింది. దానితో కొద్దిగా షాకయిన సల్మాన్ ఖాన్.. నీకు ఓ సినిమాలో ఛాన్స్ పోయిందన్నారు. దానికి సారా అలీఖాన్ అమాయ‌కంగా ఎందుకు అడిగింది. ఎందుకంటే.. నువ్వు న‌న్ను అంకుల్ అని పిలిచావ్ కదా అందుకే అంటూ సల్మాన్ ఖాన్ ఆ స్టేజ్ పై చెప్పడంతో అందరూ ఎంజాయ్ చేస్తూ నవ్వేశారు. అలా సల్మాన్ ని అంకుల్ అని పిలిచి ఆయనతో సినిమా చేసే అవకాశం మిస్ చేసుకుంది సారా అలీ ఖాన్.  

Sara Ali Khan calls Salman Khan uncle:

Sara Ali Khan Calls Salman Khan Uncle, Superstars Reaction Goes Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ