సుడిగాలి సుధీర్ కి కేరాఫ్ అడ్రెస్ అంటే ఈటీవీనే. అంతలా ఈటీవీలో సుధీర్ ఫెమస్ అయ్యాడు. అయితే సుధీర్ మాత్రం ఇప్పుడు ఈటీవికి పూర్తిగా దూరమైపోయాడు. ఢీ డాన్స్ షో లో రష్మీ తో కలిసి ఎంటర్టైన్ చేసే సుధీర్ ఇప్పుడు ఢీ షో లో లేడు. అలాగే జబర్దస్త్ షో తో పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్ జబర్దస్త్ కి బై బై చెప్పేసినట్లే. ఏదో సినిమాల బిజీతో జబర్దస్త్ కి దూరంగా ఉన్నాడని అన్నా కావాలనే సుడిగాలి సుధీర్ ఈటివి కి దూరమయ్యాడని కొందరి అభిప్రాయం. ఎందుకంటే కేవలం సినిమాల కోసం సుధీర్ జబర్దస్త్ మానేసాడంటే నమ్మబుద్దే కావడం లేదు. కారణం ఆయన స్టార్ మా షోస్, జీ ఛానల్ షోస్ లో యాంకరింగ్ చేస్తున్నాడు.
ఢీ షో, జబర్దస్త్ షో నే కాదు.. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఫన్నీ షో కి కూడా సుధీర్ రావడం లేదు. ఆ షో కి యాంకర్ గా రష్మీ దిగిపోయింది. ఇక సుధీర్ అసలు ఈటీవి లో ఏ ప్రోగ్రాంలో కనిపించడం లేదు అంటే.. పూర్తిగా సుధీర్ ఈటీవికి దూరమైనట్టే అనిపిస్తుంది. తర్వాత సుధీర్ స్టార్ మా ఛానల్ లో వస్తున్న సూపర్ సింగర్ జూనియర్స్ కి, అలాగే జీ ఛానల్ లో గత వారం ఫాథర్స్ డే స్పెషల్ గా జరిగిన థాంక్యూ దిల్ సేవ్ ప్రోగ్రాం లో శ్రీముఖి తో కలిసి యాంకరింగ్ చేసాడు. అంటే ఈటీవి లో ఉంటే ఇవన్నీ కుదరవనే కారణంతోనే సుధీర్ ఆలా ఈటీవిని వదిలేసి ఇతర ఛానల్స్ లో కనిపిస్తున్నాడేమో అనే అనుమానాలు చాలామందిలో మొదలయ్యింది.