బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తన ప్రేమికుడు రణబీర్ కపూర్ ని ఏప్రిల్ లో చాలా సింపుల్ గా వివాహం చేసుకుని బాలీవుడ్ సెలబ్రిటీస్ కి అంగరంగ వైభవంగా రిసెప్షన్ ఇచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి అయిన మూడో రోజే అలియా భట్ తన సినిమా షూటింగ్స్ తో బిజీగా మారిపోయింది. అటు రణబీర్ కపూర్ కూడా యానిమల్ షూటింగ్ కి వెళ్ళిపోయాడు. అయితే అలియా భట్ పెళ్ళైన రెండు నెలలకే తన భర్త రణబీర్ కపూర్ కి గుడ్ న్యూస్ చెప్పేసింది.
తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని భర్త రణబీర్ కి చెప్పడమే కాదు, ఆసుపత్రిలో ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని కన్ ఫమ్ చేసిన పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంది. పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్ తోనే అలియా భట్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది అనేది ఇప్పుడు ఈ విషయంతో కన్ ఫర్మ్ అయ్యింది. ఇంకా అలియా భట్ కొత్త ప్రోజెక్ట్స్ కూడా ఒప్పుకోకుండా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఐదేళ్ల ప్రేమని పెళ్లి పీటలెక్కిన ఈ జంట ఇంత త్వరగా తల్లి తండ్రులు అవడం వాళ్ళ ఫాన్స్ కి ఆనందాన్నిచ్చింది.