Advertisementt

మెగాస్టార్ కి విలన్ సెట్ అయ్యారా

Mon 27th Jun 2022 04:54 PM
r madhavan,chiranjeevi,godfather,mega 154  మెగాస్టార్ కి విలన్ సెట్ అయ్యారా
R Madhavan to play the villain in Chiranjeevi మెగాస్టార్ కి విలన్ సెట్ అయ్యారా
Advertisement
Ads by CJ

మెగాస్టార్ వరస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఆయన మూడు సినిమాల షూటింగ్స్ ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు. మెహర్ రమేష్, మోహన్ రాజా, బాబీ సినిమాల షూటింగ్స్ ని చిరంజీవి వరసబెట్టి లాగించేస్తున్నారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ లతో పాటుగా బాబీ తో మెగా 154 షూటింగ్ చేస్తున్న చిరంజీవికి విలన్స్ గా గాడ్ ఫాదర్ లో సత్య దేవ్ కనిపిస్తున్నారు. ఇక మెగా 154 లో చిరంజీవి తో తలపడబోయే విలన్ మీద క్లారిటీ లేదు. అప్పుడే సంక్రాంతికి రిలీజ్ అంటూ బాబీ మెగా 154 రిలీజ్ డేట్ ప్రకటించేసారు. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మెగా 154 లో రవితేజ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నారనే న్యూస్ ఉంది.

ఇప్పుడు మెగాస్టార్ కి మెగా 154 లో విలన్ గా కోలీవుడ్ హీరో మాధవన్ ని తీసుకోబోతున్నారని అంటున్నారు. మాధవన్ ఇప్పటికే సవ్యసాచిలో విలన్ గా ఇరగదీసాడు. ఆ సినిమా సక్సెస్ అవ్వకపోయినా మాధవన్ కేరెక్టర్ కి మంచి పేరు వచ్చింది. ఇంటర్వెల్‌లో వచ్చే అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లో మాధవన్ పాత్ర రివీల్ అవుతుంది అని, మాధవన్ రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని తెలుస్తుంది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మెగా 154 పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

R Madhavan to play the villain in Chiranjeevi :

R Madhavan to play the villain in Chiranjeevi Godfather?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ