Advertisementt

అందులో బన్నీనే నెంబర్ 1

Mon 27th Jun 2022 09:39 PM
allu arjun,south actors,google search,ram charan  అందులో బన్నీనే నెంబర్ 1
Allu Arjun topped the list of most searched South actors అందులో బన్నీనే నెంబర్ 1
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ పుష్ప సినిమాని సోలో గా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఒంటి చేత్తో ప్రమోషన్స్ చేసుకుని ఈ రికార్డ్ సాధించాడు అల్లు అర్జున్. సుకుమార్ అండ్ టీం పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా.. అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక తో కలసి ప్రతి భాషలో పుష్పని ప్రమోట్ చేసాడు. ఆ ప్రమోషన్స్ ఇంకాస్త పెంచి ఉంటే.. పుష్ప పార్ట్ వన్ కలెక్షన్స్ మరింతగా పెరిగేవి.. అయినా పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దానితో అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయింది.

అలాంటి బన్నీ ఇప్పుడొక అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. లాస్ట్ ఇయర్ గూగుల్ సెర్చ్ చేసిన సెలబ్రిటీస్ లిస్ట్ లో అల్లు అర్జున్ నెంబర్ వన్ లో ఉన్నాడు. గత ఏడాది గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన హీరో పేరు అల్లు అర్జున్. 2021లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన ఆసియా సెలబ్రెటీల జాబితాను తాజాగా గూగుల్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో సౌత్ లో ఈ నెంబర్ వన్ స్థానాన్ని బన్నీ సొంతం చేసుకున్నాడు. ఆ లిస్ట్ లో బన్నీ నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకుంటే.. తర్వాత ప్లేస్ లో రామ్‌ చరణ్‌ ఉ‍న్నాడు. తమిళ స్టార్‌ హీరో సూర్య కోలీవుడ్‌ నటుల్లో అగ్రస్థానంలో ఉన్నాడు.

Allu Arjun topped the list of most searched South actors:

Allu Arjun topped the list of most searched South actors, followed by Ram Charan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ