Advertisementt

పృథ్వీరాజ్ సుకుమారన్ కడువా డేట్ చేంజ్

Tue 28th Jun 2022 02:59 PM
prithviraj sukumaran,kaduva movie,vivek oberai,kaduva postponed  పృథ్వీరాజ్ సుకుమారన్ కడువా డేట్ చేంజ్
Kaduva in theatres from 𝐉𝐮𝐥𝐲 𝟕𝐭𝐡 పృథ్వీరాజ్ సుకుమారన్ కడువా డేట్ చేంజ్
Advertisement
Ads by CJ

మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ కడువా. పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న  జూన్ 30న ఈ చిత్రాన్ని  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు నిర్మాతలు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన సినిమా విడుదల వారం రోజులు వాయిదా పడింది. జూలై 7న సినిమాని విడుదల చేస్తున్నట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రకటించారు అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులందరికీ క్షమాపణలు. 

అనుకోని పరిస్థితుల వలన కడువా చిత్రం విడుదల జూలై7 కి వారం రోజుల వాయిదా పడింది. ప్రచార కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగిస్తాము. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కి మీఅందరి ప్రేమ, మద్దతు కొనసాగాలి' అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు పృథ్వీరాజ్. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనున్నారు.

Kaduva in theatres from 𝐉𝐮𝐥𝐲 𝟕𝐭𝐡:

Prithviraj Sukumaran Kaduva postponed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ