Advertisementt

దిల్ రాజు ఇంట వారసుడొచ్చాడు

Wed 29th Jun 2022 10:23 AM
dil raju,baby boy,dil raju second wife,tejaswini  దిల్ రాజు ఇంట వారసుడొచ్చాడు
Dil Raju Blessed With A Baby Boy దిల్ రాజు ఇంట వారసుడొచ్చాడు
Advertisement
Ads by CJ

దిల్ రాజు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్. ఒకప్పుడు టాలీవుడ్ లో చిన్న సినిమాలు, మీడియం సినిమాలను నిర్మిస్తూ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలతో పాటుగా పాన్ ఇండియా మూవీస్ ని కూడా నిర్మిస్తూ బడా ప్రొడ్యూసర్ గా డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీ ప్రముఖులలో ఒకరిగా ఉన్న దిల్ రాజు కెరీర్ లో హ్యాపీ గానే ఉన్నారు. కానీ ఆయన కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో భార్య అనితని కోల్పోయారు. దిల్ రాజు కూతురు కి పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. అయితే కరోనా లాక్ డౌన్ లో దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో తేజస్విని అనే అమ్మాయిని పెళ్లాడారు దిల్ రాజు. 

ఆ తర్వాత ఆయన తన 50 వ బర్త్ డే వేడుకలని ఇండస్ట్రీ ప్రముఖులు, స్టార్ హీరోల మధ్యన ఘనంగా చేసుకుని తన రెండో భార్యని అందరికి పరిచయం చేసారు. అయితే గత కొన్ని నెలలుగా దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారు, ఆయన రెండో భార్య ప్రెగ్నెంట్ అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజాగా దిల్ రాజు భర్య దిల్ రాజుకి వారసుడిని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అది కూడా నటుడు బండ్ల గణేష్ దిల్ రాజు అన్నా కాంగ్రాచులేషన్స్ అని తెలుపుతూ ట్వీట్ పెట్టారు. ఈ మేరకు దిల్ రాజుకు కొడుకు పుట్టాడని తెలుపుతూ అసలు విషయాన్ని బండ్ల గణేష్ బయటపెట్టాడు. దిల్ రాజు దంపతులకు కుమారుడు జన్మించడంతో దిల్ రాజుకు వారసుడు వచ్చినట్లయింది. దిల్ రాజుకు కొడుకు పుట్టాడని తెలిసి పలువురు సినీ ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Dil Raju Blessed With A Baby Boy:

Dil Raju, his wife blessed with a baby boy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ