Advertisementt

విక్రమ్ డైరెక్టర్ కోసం గ్యాంగ్‌స్టర్‌గా విజయ్

Wed 29th Jun 2022 11:16 AM
vijay,lokesh kanagaraj,master,vijay setupati,khaidi,vikram  విక్రమ్ డైరెక్టర్ కోసం గ్యాంగ్‌స్టర్‌గా విజయ్
Vijay-Lokesh Kanagaraj project backdrop revealed విక్రమ్ డైరెక్టర్ కోసం గ్యాంగ్‌స్టర్‌గా విజయ్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ టాలీవుడ్ డైరెక్టర్ వంశి పైడిపల్లి తో వారసుడు సినిమా చేస్తున్నారు. వారసుడు ని సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు, వారసుడిగా విజయ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కమిట్ అయ్యారు. అంతకుముందే మాస్టర్ తో ఈ కాంబినేషన్ అదరగొట్టేసింది. మరోసారి హిట్ కాంబినేషన్ రిపీట్ అవడం, అలాగే విక్రమ్ తో 400 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన లోకేష్ కనగరాజ్ సినిమా కావడంతో అప్పుడే ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి.

అయితే విజయ్ తో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించబోయే సినిమా ముంబై నేపథ్యంలో ఉండబోతుంది అని, కథకు తగ్గట్టుగా విజయ్ ను గ్యాంగ్ స్టర్ గా చూపించనున్నాడని అంటున్నారు. అందుకు తగినట్టుగానే విజయ్ లుక్ ని లోకేష్ కనగరాజ్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. లోకేష్ ఖైదీ, విక్రమ్ లు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆయన నుండి రాబోతున్న ఏ ప్రోజెక్ట్ అయినా.. ఇప్పుడు క్రేజీగా మారింది.

Vijay-Lokesh Kanagaraj project backdrop revealed:

Speculation on Vijay-Lokesh Kanagaraj project

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ