బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నటుడు సామ్రాట్.. ఆ సీజన్ లో తేజస్విని తో క్లోజ్ గా మూవీ అయ్యాడు. అలా కాస్త ఫెమస్ అవడమే కాదు, టాప్ 5 వరకు వెళ్ళాడు. అయితే సామ్రాట్ బిగ్ బాస్ కి వెళ్లకముందే పెళ్లి చేసుకుని భార్యతో విడిపోయాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే సామ్రాట్ విడాకుల కోసం సీక్రెట్ గా కోర్టుకి వెళ్ళొచ్చాడు. మొదటి భార్య తో సామ్రాట్ పడిన కష్టాలను బిగ్ బాస్ లో తన ఫ్రెండ్స్ తో పంచుకున్నాడు. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక సామ్రాట్ శ్రీలిఖిత ని రెండో వివాహం చేసుకున్నాడు.
కరోనా లాక్ డౌన్ లో సింపుల్ గా రెండో పెళ్లి చేసుకున్న సామ్రాట్ తాజాగా తాను తండ్రి కాబోతున్న విషయాన్ని అందరితో పంచుకోవడమే కాదు, మా చిన్న బిడ్డ రాకకోసం మేము ఎంతగానో, ఆతృతగా ఎదురుచూస్తున్నాం అంటూ, తన భార్య శ్రీలిఖిత బేబీ బంప్ పిక్స్‌ను షేర్ చేశాడు. దానితో సామ్రాట్ స్నేహితులు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సామ్రాట్ కి కంగ్రాట్స్ చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.