నటి పవిత్ర లోకేష్ సీనియర్ నరేష్ ని నాలుగో వివాహం చేసుకోబోతుంది అనే న్యూస్ గత కొన్నాళ్లుగా మీడియాలో చక్కర్లు కొట్టడమే కాదు, అటు నరేష్, ఇటు అపవిత్ర లోకేష్ లు ఇద్దరూ ఈ పెళ్లి విషయమై డైరెక్ట్ గానే మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు పవిత్ర లోకేష్ పై ఆమె భర్త సుచేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. పవిత్రది కాపురాలు కూల్చే మనసు అని, పెళ్ళైన తొలినాళ్లలో బాగానే ఉండేది. మాకు ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత ఆమె నన్ను వదిలేసి వెళ్లింది. ఒక నటిగా ఉన్న ఆమెకు ఇలాంటి తీరు మంచిది కాదు అని చాలాసార్లు నేను ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఆమె బుద్ది మారలేదు.
ఆమె నన్ను వదిలేసి వెళ్ళాక చాలా బ్యాలెన్సుడ్ గా ఉన్నాను. నాకు ఇష్టమైన సాహిత్యంతో ప్రశాంతంగా గడిపేస్తున్నాను. నాకు ఒంటరి జీవితమే బావుంది అంటూ సుచేంద్ర ప్రసాద్ తన భార్య పవిత్రపై సంచలనంగా మాట్లాడారు. నా దగ్గర ఆస్తి లేదని ఆమె నన్ను విడిచి వెళ్లింది. ఈమె వల్ల చాలామందికి అన్యాయం జరిగింది. డబ్బులు, లగ్జరీ లైఫ్ లీడ్ చేయడమే పవిత్రా లోకేష్ లక్ష్యం. నాతో సంసారం చేసే టైం లోనే కొందరితో రిలేషన్ పెట్టుకొనిందనే విషయం నా దృష్టికి వచ్చింది. అయితే నేను పట్టించుకోలేదు. కానీ నాకు మోసం చేసి వెళ్లిపోయింది అని సుచేంద్ర ప్రసాద్ అన్నారు. కాపురాలు కూల్చే ఆమె నేను కొడతాను, తిడతాను అని చెప్పింది. ఒకవేళ నేను కోపం చేస్తే ఆమె నరేష్ తో వెళ్లి ఉండడం కరెక్ట్ యేనా అంటూ ఆయన మాట్లాడుతున్నారు. త్వరలోనే ఆమె నరేష్ ని కూడా వదిలేస్తుంది అంటూ ఆయన సంచలనంగా మాట్లాడారు.