Advertisementt

అల్లు అర్జున్ దసరా అనౌన్సమెంట్ అదేనా

Thu 30th Jun 2022 09:19 PM
allu arjun,sanjay bhansali,koratala shiva,pushpa 2  అల్లు అర్జున్ దసరా అనౌన్సమెంట్ అదేనా
Allu Arjun - Sanjay Leela project announcement on Dasara? అల్లు అర్జున్ దసరా అనౌన్సమెంట్ అదేనా
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారా అనే అతృతతో ఆయన ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. సుకుమార్ పుష్ప 2 కోసం గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికే పుష్ప ద రూల్ కోసం లొకేషన్స్ చూసుకోవడం, అలాగే ఈ సినిమాలో ఇంకా కొంతమంది నటులు అవసరం ఉండడం తో సుకుమార్ ఆ పనిలో బిజీగా వున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాస్ అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ దసరా కు ఉండబోతున్నట్టుగా చెప్పి అందరిలో సస్పెన్స్ క్రియేట్ చేసారు. దానితో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమై ఉంటుందా అనే క్యూరియాసిటీలోకి అందరూ వెళ్లిపోతున్నారు. 

అసలైతే బన్నీ కొరటాలతో మూవీ చెయ్యాల్సి ఉంది. కానీ కొరటాలతో బన్నీ మూవీ ఆగిపోయింది. అల్లు అర్జున్ ఇప్పుడు తన తదుపరి మూవీ ని బాలీవుడ్ లో స్ట్రయిట్ మూవీ గా చేయాలనుకుంటున్నారు కాబట్టి.. ఆయన తరచూ ముంబై లో తేలుతున్నారని, అది సంజయ్ లీలా భన్సాలీతో బన్నీ తర్వాత ప్రాజెక్ట్ ఉండొచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దసరాకి బన్నీ నుండి రాబోయే అనౌన్సమెంట్ ఖచ్చితంగా సంజయ్ లీలా భన్సాలీదే ఉండొచ్చని అందరూ ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

Allu Arjun - Sanjay Leela project announcement on Dasara?:

Allu Arjun – Bhansali in talks for a Big Budget film?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ