అల్లు అర్జున్ పుష్ప ద రూల్ షూటింగ్ కోసం రెడీ అవుతున్నారనుకుంటే ఆయన ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి చెక్కేసినట్లుగా ఓ న్యూస్ మీడియాలో హైలెట్ అయ్యింది. ఈ నెలాఖరున కానీ, ఆగష్టు లో కానీ పుష్ప 2 షూటింగ్ మొదలవుతుంది కాబట్టి అల్లు అర్జున్ ఈలోపు ఫ్యామిలీ తో వెకేషన్స్ ని ఎంజాయ్ చెయ్యడానికి విదేశాలకు వెళ్లినట్టుగా తెలుస్తుంది. భార్య స్నేహ రెడ్డి, ఆయన్, అర్హలతో కలిసి బన్నీ ఫారిన్ ఫ్లైట్ ఎక్కినట్లుగా ప్రచారం మొదలైంది. అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో తో కలిసి టాంజానియా అనే దేశానికి విహారయాత్ర కోసం వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈ ట్రిప్ ముగియగానే బన్నీ మళ్ళీ పుష్ప రాజ్ గా మారబోతున్నారట.
సుకుమార్ ఇప్పటికే పుష్ప ద రూల్ షూటింగ్ కి సంబందించిన వర్క్ పూర్తి చేసారని, అలాగే పుష్ప ద రూల్ కోసం కొంతమంది బాలీవుడ్ నటులని ఎంపిక చేసే పనిలో సుక్కు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే పుష్ప ద రూల్ షూటింగ్ కూడా కొంతమేర గతంలోనే పూర్తి చేసినా.. ఇప్పుడు పాన్ ఇండియా స్టయిల్ కి సరిపోయేలా మరోసారి ఆ సన్నివేశాలని రీ షూట్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. మరి సుక్కు - బన్నీ పుష్ప ద రైజ్ తో సంచాలను నమోదు చేసారు. ఆ సంచలనాలు పుష్ప ద రూల్ తో ఇంకెంత డెవెలెప్ చేస్తారో చూడాలి.