ఇండస్ట్రీలో సోలో ఫైట్ చేస్తూ రౌడీ స్టార్ గా తనకో బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకోవడమే కాదు, బాలీవుడ్ లోను క్రేజీ టాలీవుడ్ స్టార్ గా హీరోయిన్స్ మనసులను దోచేసిన విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం నటించిన పాన్ ఇండియా మూవీ లైగర్ విడుదలకు సమయం దగ్గర పడుతుంది. పూరి జగన్నాధ్ తో కలిసి పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చెయ్యడానికి రెడీ అవుతున్న విజయ్ దేవరకొండ ఫాన్స్ కి ఆడియన్స్ కి బిగ్గెస్ట్ షాకిచ్చాడు. ఆగస్టు 25న విడుదల కాబోతున్న లైగర్ మూవీ ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ చాలా డిఫ్రెంట్ గా రెడీ అయ్యాడు.
పెరఫార్మెన్స్ పరంగా మానసికంగా, శారీరకంగా లైగర్ సినిమా కోసం నా సర్వస్వం పెట్టాను. లైగర్ లో నేను చేసింది ఎంతో ఛాలేంజింగ్ రోల్. నేను మీకు అన్ని ఇస్తాను. త్వరలో లైగర్ వచ్చేస్తుంది.. అంటూ ఓ దారుణమైన ఫోటో ని షేర్ చేసాడు విజయ్. విజయ్ దేవరకొండ నగ్నంగా ఉండి మధ్యలో రోజా పూలు అడ్డుపెట్టుకుని కనిపించి మరీ అందరికి సూపర్ షాకిచ్చాడు. మరి లైగర్ మూవీ లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ న్యూడ్ పోస్టర్ ఎందుకో ఫాన్స్ కయితే అర్ధం కాకపోయినా.. విజయ్ లైగర్ కోసం ఎంతకైనా తెగిస్తాడు అంటూ ఫాన్స్ తెగ చర్చించేసుకుంటున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే నటించింది. కరణ్ జోహార్ - ఛార్మి - పూరి ఈ సినిమాని నిర్మించారు.