Advertisementt

ధనుష్ కెప్టెన్ మిల్లర్ టైటిల్ రివీల్డ్

Sat 02nd Jul 2022 06:40 PM
dhanush,arun matheswaran,t.g. thyagarajan,sathya jyothi films,captain miller movie  ధనుష్ కెప్టెన్ మిల్లర్ టైటిల్ రివీల్డ్
Dhanush Captain Miller Announced ధనుష్ కెప్టెన్ మిల్లర్ టైటిల్ రివీల్డ్
Advertisement
Ads by CJ

నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్‌ కలయికలో ఓ భారీ పీరియాడికల్ చిత్రం రూపొందనుంది. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందనుంది. సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెప్టెన్‌ మిల్లర్‌ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో చాలా ఆసక్తికరంగా వుంది. ఒక స్కెచ్ డ్రాయింగ్ లో 1930-40నాటి షిప్ ని చూపిస్తూ కథానాయకుడి పాత్ర ముఖం కనిపించకుండా స్కార్ఫ్ నిచుట్టుకొని ఒక వింటేజ్ బైక్ నడుపుకుంటూరావడం, తర్వాత టైటిల్ రివిల్ కావడం ఎక్సయిటింగా వుంది. వీడియోలో వినిపించిన నేపధ్య సంగీతం అవుట్ స్టాండింగా వుంది. ఈ చిత్రం భారీ పీరియాడికల్ మూవీగా వుండబోతుందని ఈ వీడియోని చూస్తే అర్ధమౌతుంది.  

కెప్టెన్ మిల్లర్ అధికారిక ప్రకటనకు ముందే భారీ సంచలనం సృష్టించింది. సత్యజ్యోతి ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవంగా అందించే దిశగా ఎక్కడా రాజీలేకుండా పని చేస్తుంది. ప్రాజెక్ట్ ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి చిత్ర యూనిట్ ఏడాది పాటు విస్తృతమైన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేసింది.

సత్యజ్యోతి ఫిలింస్, నిర్మాత టి.జి. త్యాగరాజన్ మాట్లాడుతూ.. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కెప్టెన్ మిల్లర్’ ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇది మా ప్రొడక్షన్ హౌస్ నుండి భారీ స్థాయిలో రూపొందిన ప్రామిసింగ్ మూవీలలో ఒకటిగా ఉంటుందని బలంగా నమ్ముతున్నాను. ఐకాన్ స్టార్ ధనుష్‌తో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది. మేము గతంలో కలసి చేసిన చిత్రాలు విజయవంతమయ్యాయి. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ నాకు, ధనుష్‌కి స్క్రిప్ట్‌ను చెప్పినపుడు , మేమిద్దరం ఎగ్జైట్ అయ్యాము, భారీ స్థాయిలో రూపొదించాలని భావించాం. దర్శకుడు అరుణ్ అసాధారణమైన ఆలోచనలతో విలక్షణ ఫిల్మ్ మేకింగ్ మెథడాలజీలతో అసాధారణమైనవి చిత్రాలు అందిస్తుండటం ప్రసంశనీయం. కెప్టెన్ మిల్లర్ ని మరింత గొప్ప స్థాయికి వెళుతుంది అన్నారు.

Dhanush Captain Miller Announced:

Dhanush, Arun Matheswaran, T.G. Thyagarajan, Sathya Jyothi Films Captain Miller Announced

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ