సీనియర్ నటుడు నరేష్ గత కొన్ని రోజులుగా మీడియాలోనే ఉంటున్నారు. కారణం ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఓ కారణం కాగా, రెండోవది పవిత్ర లోకేష్ ని నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారు అని. అయితే పవిత్ర లోకేష్ - నరేష్ పై వచ్చే రూమర్స్ అన్నీ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి క్రియేట్ చేసినవే అంటూ నరేష ఆరోపించడమే కాదు, తన మాజీ భార్య రమ్య మంచిది కాదని, డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తుంది అని, తమ డ్రైవర్ తో ఎఫ్ఫైర్ నడుపుతుంది అని, నన్ను నా ఫ్యామిలీని డబ్బు కోసం నరక చూపిస్తుంది అని, రమ్య రఘుపతి ఆమె ఫ్యామిలీ వల్ల తనకి ప్రాణహాని ఉంది అంటూ సంచలన కామెంట్స్ చేసారు నరేష్. ఆమెకి విడాకులు నోటీసు పంపించాను, రమ్య చేసిన అప్పుల వలన నేను భయపడిపోయాను.
ఆమె ఎమ్యెల్యే కావాలని ఆశతోనే కాదు డబ్బు వ్యామోహంలో ఉంది. ఏవేవో కంపెనీలు పెట్టి డబ్బులు పోగొట్టింది, నేను పవిత్ర లోకేష్ కోసం డివోర్స్ ఇవ్వడం లేదు. ఆమె చేసే పనుల వలనే ఆమెకి విడాకుల నోటీసు లు ఇచ్చాను. ఆమె పేరు నా పాస్ పోర్ట్ నుండి తొలగించాను, ఇకపై నేను పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకుంటానో? లేదంటే సహజీవనం చేస్తానో? అనేది కాలమే నిర్ణయిస్తుంది. నేను ఏది చేసినా అది మీడియాకి వివరిస్తాను అంటూ నరేష్ సంచలనంగా మట్లాడారు.