ఒకప్పుడు లవర్ బాయ్ లా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకతని చాటుకున్న హీరో తరుణ్.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఆర్తి అగర్వాల్ తో ప్రేమ లో ఉన్నాడనే ప్రచారం జరిగిన, తరుణ్ తల్లి రోజారమణి ఆర్తి అగర్వాల్ ని బెదిరించింది అని చెప్పిన తర్వాత నుండే తరుణ్ కెరీర్ పూర్తిగా క్లోజ్ అయ్యింది. ఆ తర్వాత సినిమాలు చేసినా అతనికి సక్సెస్ ని ఇవ్వలేదు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరమైన తరుణ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాడు. కారణం బిగ్ బాస్. గతంలోనూ తరుణ్ బిగ్ బాస్ కి రాబోతున్నాడని అన్నా అది సాధ్యం కాలేదు.
కానీ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి తరుణ్ పక్కాగా వస్తున్నాడని అంటున్నారు. ఆగష్టు కానీ సెప్టెంబర్ నుండి మొదలు కాబోయే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి తరుణ్ ఎంట్రీ ఈసారి పక్కా అంటూ వార్తలొస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఈసారి సామాన్యులకి ఎంట్రీ ఉండబోతుంది. మరి నిజంగా తరుణ్ బిగ్ బాస్ కి వస్తే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాడు అనడంలో సందేహం లేదు. బిగ్ బాస్ ద్వారా అతనికి క్రేజ్ రావడం పక్కా. అందుకే తరుణ్ ఈసారి బిగ్ బాస్ పై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది.