ఈ రోజు ఉదయం మైసూర్ కోరం హోటల్ వద్ద పెద్ద రచ్చ జరిగింది. గత రాత్రి నుండి పవిత్ర లోకేష్ - నరేష్ తో కలిసి ఉండడంతో నరేష్ మూడో భార్య ఆ కోరం హోటల్ వద్దకి వచ్చి పవిత్ర లోకేష్ పై చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నం చెయ్యడం కలకలం సృష్టించింది. నేను అంతా తెలుసుకున్నాకే హోటల్ వద్దకు వచ్చాను, రాత్రి పూట ఎందుకులే అని ఊరుకున్నాను. నా బాధలు చెప్పుకున్నాను. రెస్పాన్స్ ఏంటి అన్నది మీడియాలో మీరే చూస్తున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మాత్రం రాత్రంతా ఒకే రూమ్‌లో ఉండటం ఏంటి? ఫ్రెండ్స్ అయితే ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవాలి గాని.. ఇలా హోటల్ రూమ్స్ లో ఉండడం ఏమిటి? నా బంగారం మంచిదికానప్పుడు నేను ఎవ్వరిని ఏమి అనగలను, పవిత్ర లోకేష్ ని నేను ఏమి అనడం లేదు. ఆమెకి భర్త ఉన్నాడు. భర్త ముందే మాట్లాడుకోవచ్చుగా అంటూ రమ్య రఘుపతి సంచలన ఆరోపణలు చేసింది.
ఇక ఈ ఇన్సిడెంట్ తర్వాత నరేష్ విజిల్స్ వేస్తూ బిహేవ్ చెయ్యగా.. పవిత్ర లోకేష్ మాత్రం సైలెంట్ గా రూమ్ నుండి లిఫ్ట్ లోకి వెళ్లిపోయారు. పవిత్ర కూడా ఆమె ఓ వీడియో విడుదల చేస్తూ.. తాను కర్నాటక నుంచే టాలీవుడ్‌కు వచ్చానని, చాలా ఏళ్లుగా తెలుగులో నటిస్తూ అందరికి దగ్గరయ్యానన్నారు. తన సమస్యను అందరితో పంచుకోవాలని ఉంది అన్నారు. నరేష్ భార్య అని చెప్పి రమ్య బెంగళూరు వచ్చి తన గురించి చెడ్డగా మాట్లాడడమే కాకుండా తనని మాటిమాటికి కించపరుస్తుంది, ఫ్యామిలీ ఇష్యుస్ అన్ని ఇంట్లోనే సెట్ చేసుకోవాలని, అసలు అక్కడ ఏం జరగలేదని పవిత్ర చెబుతున్నారు.
ఇక నరేష్ భార్య మాత్రం నేను నా భర్త తోనే కలిసి ఉంటాను, నా కొడుక్కి అమ్మా నాన్న ఇద్దరూ కావాలి, నేను డబ్బు కోసం వచ్చాను అంటూ నాపై నిందలు మోపారు. చూసుకుందామని వచ్చాను అంటూ ఆవిడ చేసే ఆరోపణలు ఆవిడ చేస్తుంది. తప్పు చెయ్యనివాడైతే నరేష్ హోటల్ రూమ్ నుండి అలా బయటికి ఎందుకు వెళ్ళిపోతాడు అంటూ రమ్య నరేష్ ని నిలదీస్తుంది.