రామ్ చరణ్ కి ఉపాసన కామినేనితో వివాహం జరిగి పదేళ్లయ్యింది. ఈమధ్యనే చరణ్ - ఉపాసనలు తమ వివాహ వార్షిక మహోత్సవాన్ని విదేశాల్లో సెలెబ్రేట్ చేసుకున్నారు. రామ్ చరణ్ షూటింగ్స్ తోనూ, ఉపాసన అపోలో ఆసుపత్రి పనులతో బిజీగా ఉన్నప్పటికీ.. టైం దొరికినప్పుడల్లా వీరు వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇంత చక్కగా సాగిపోతున్న వీరి లైఫ్ లో పిల్లలు లేని లోటుని అభిమానులు అనుభవిస్తున్నారు. ఉపాసన కి కూడా తరచూ.. పెళ్ళై పదేళ్ళయింది పిల్లలు లేరు అనే ప్రశ్నే ఎదురవుతుంది. కానీ పిల్లలు అనేది తమ పర్సనల్ వ్యవహారం అంటూ ఉపాసన మాట దాటేస్తుంది.
అయితే తాజాగా ఉపాసన ఆధ్యాత్మిక గురువు సద్గురుతో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఉపాసన సద్గురుని పిల్లల విషయమై ప్రశ్నించింది. అలాగే RRR అంటే సినిమా అనుకుంటున్నారేమో.. R రిలేషన్, R రీ ప్రొడ్యూస్, R రోల్ ఇన్ లైఫ్. కానీ చాలా మంది ప్రజలు నా లైఫ్ గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు. మొదటి R.. నా రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతున్నారు, రెండవ R.. రీ ప్రొడ్యూస్, మూడవ R.. లైఫ్ లో నా రోల్.. వీటి గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు అంటూ సద్గురుకి తెలిపింది. దీనికి సద్గురు కూడా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు.
రిలేషన్ షిప్ అనేది నీ పర్సనల్. రీ ప్రొడ్యూస్ విషయానికి వస్తే.. ఆరోగ్యంగా ఉండి కూడా పిల్లలు కనకూడదు అని నిర్ణయించుకున్న వారిని నేను మెచ్చుకుంటాను. కారణం విపరీతంగా జనాభా పెరుతున్న తరుణంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అభినందించదగిన విషయం. మనుషులు అంతరించిపోతున్న జీవులు కాదు.. అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఉపాసన అలా సద్గురుని ప్రశ్నించడంతో.. అసలు ఉపాసన ఆలోచన ఏమై ఉంటుంది. పిల్లలని కనాలనా? లేదా వద్దనుకుంటున్నారా? అనే కన్ఫ్యూషన్లోకి ఫాన్స్ వెళుతున్నారు.