Advertisementt

బింబిసారా ట్రైలర్ వచ్చేసింది

Mon 04th Jul 2022 05:42 PM
bimbisara,bimbisara trailer,kalyan ram,bimbisara movie  బింబిసారా ట్రైలర్ వచ్చేసింది
Bimbisara Trailer released బింబిసారా ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ట్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ బింబిసారా. ఈ సినిమా ఆగష్టు మొదటి వారంలో రిలీజ్ కి రెడీ అవుతుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు. మహేష్ AMB మాల్ లో జరిగిన కార్యక్రమంలో బింబిసారా ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ ట్రైలర్ లో కళ్యాణ్ రామ్ బింబిసారుడిగా పవర్ ఫుల్ లుక్ లో కనిపించడమే కాదు, మరో లుక్ లో మోడరన్ గా ను కనిపించారు. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ అదిరిపోయారనే చెప్పాలి.

బింబిసారుడంటేనే మరణ శాసనం. ఇక్కడ రాక్షసుడైనా, భగవంతుడైనా బింబిసారుడొక్కడే. పట్టుమని వందమంది కూడా లేరు, ఓ యుద్ధం మీద పడితే చూస్తారా. ఎవడ్రా నిన్ను పంపింది అని పైనున్న ఆ యముడదిగితే చెప్పు.. కిందొకడున్నాడు.. వాడి పేరు బింబి, త్రిగర్తలా సామ్రాజ్యాధిపతి బింబిసారుడని చెప్పు.. అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉండగా, హీరోయిన్ కేథరిన్ లుక్ రాణిగా ఆకర్షణగా కనిపించింది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం అన్ని బావున్నాయి.

Bimbisara Trailer released :

Bimbisara Trailer review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ